యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరి కాంగ్రెస్‌లో సోషల్‌మీడియా వార్నడుస్తోంది. లీడర్ల తరఫున కార్యకర్తలు వకాల్తా పుచ్చుకొని తీవ్ర స్థాయిలో పోస్టులు పెడుతున్నారు. పార్టీలు మారి వచ్చిన వారిని కోవర్టులు అంటూ కొందరు కామెంట్స్చేస్తుంటే.. టికెట్ఎవరికిచ్చినా గెలిచిన తర్వాత పార్టీ మారనని గుడిలో ప్రమాణం చేయించాలని మరికొందరు డిమాండ్చేస్తున్నారు. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడిగా కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కొనసాగినంత కాలం కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి, కుంభం గ్రూపులు కొనసాగేవి. కుంభం తన పదవికీ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరగా, బీజేపీ నుంచి వచ్చిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఓసీలకు టికెట్ఇస్తే జిట్టాకే ఇస్తారని, బీసీలకు ఇస్తే పోత్నక్ప్రమోద్కుమార్, తంగెళ్లపల్లి రవికుమార్, పంజాల రామాంజనేయులు గౌడ్సహా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఈ సమయంలోనే బీఆర్ఎస్లో చేరిన కుంభం తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో భువనగిరి కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన జిట్టా గ్రూప్తెరపైకి వచ్చింది. కుంభం తిరిగి చేరినప్పటి నుంచి భువనగిరిలోని ‘సోషల్‌మీడియా కాంగ్రెస్’ గ్రూప్‌లో జిట్టా వర్సెస్ కుంభం అన్నట్టుగా పోస్టుల వార్మొదలైంది. మామాలుగా మొదలైన వార్గడిచిన వారం రోజులుగా తీవ్రస్థాయిలో సాగుతోంది. జిట్టా, కుంభం అనుకూలవాదులు తమ తమ లీడర్లకు జిందాబాద్‌లు చెబుతూ.. పక్క లీడర్ పై విమర్శలు పోస్టింగ్చేస్తున్నారు. కుంభం తిరిగి కాంగ్రెస్‌లో చేరడం వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ పోస్టులు చేస్తున్నారు. ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుందో అన్న భయంతో కేసీఆర్కుట్ర పన్ని బీఆర్ఎస్లో చేరిన కుంభంను తిరిగి పంపించాడంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. తమ లీడర్‌కే టికెట్వస్తుందంటూ జిట్టా, కుంభం అనుకూలవాదులు గ్రూప్‌లో పోస్టులు చేస్తూనే ఒపీనియన్ పోల్నిర్వహించడంతో కొందరు కార్యకర్తలు తాము ఎవరికి అనుకూలమో పోస్ట్ చేస్తున్నారు.
ప్రమాణాలు చేయించాలని పోస్టులు
టికెట్ఎవరికి ఇచ్చినా వారితో ఎన్నికల ముందు లేదా, గెలిచిన తర్వాత పార్టీ మారనని భువనగిరి ఎల్లమ్మ గుడిలో ప్రమాణం చేయించాలని కొందరు, యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహా స్వామి గుడిలో ప్రమాణం చేయించాలని మరికొందరు పోస్టింగ్‌లు పెట్టారు. జిట్టాను చేర్చుకున్న తర్వాత కుంభంను ఎందుకు కలిశాడంటూ కామెంట్స్చేశారు. అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందని, సోషల్‌మీడియా గ్రూపుల్లో పోస్టులు పెట్టొద్దని కొందరు వారిస్తున్నా, పరస్పర పోస్టులు ఆగడం లేదు.