IND vs AUS: తొలి రోజు నో ఛాన్స్: మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్ట్.. 86 వేల టికెట్స్ సోల్డ్ ఔట్

ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్   క్రేజ్ ఆకాశాన్ని దాటేస్తుంది.  రెండు జట్లు టెస్ట్ క్రికెట్ లో అసలైన మజాను చూపిస్తాయి. అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. వెరసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తున్నాయి.   మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు నాలుగో టెస్ట్ జరుగుతుంది. మరో రెండు వారల సమయం ఉన్నప్పటికీ అభిమానులు ఈ మ్యాచ్ చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కెపాసిటీ 90,000. ఈ మ్యాచ్ కు ప్రారంభ రోజు టిక్కెట్‌లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం విశేషం. దాదాపు 86 వేల టికెట్స్ అమ్ముడుపోయినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం ఈ విషయాన్ని అధికారికంగా  ధృవీకరించింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు మాత్రమే కొన్ని టిక్కెట్లను ప్రజల కోసం విడుదల చేస్తామని తెలిపింది. 

మెల్‌బోర్న్ టెస్టుకు టికెట్ల రేట్లు సాధారణ ధర కంటే మూడు రేట్లు పెంచారు. ఈ స్టేడియం కెపాసిటీ మొత్తం 90000. బాక్సింగ్ డే టెస్ట్ ప్రతిసారి మెల్ బోర్న్ వేదికగా జరుగుతుంది. ఈ టెస్ట్ చూడడానికి ప్రేక్షకులు భారీగా తరలి వస్తారు. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్స్ భారీగా పెంచినప్పటికీ అన్ని టికెట్స్ సోల్డ్ ఔట్ కావడం విశేషం.  

Also Read :- రోహిత్ శర్మ ఏదీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

భారత్, ఆస్ట్రేలియా ఈ టెస్టుకు ముందు బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ ఆడాల్సి ఉంది. గబ్బా వేదికగా జరగనున్న మూడో టెస్టు విషయానికొస్తే.. రెండో రోజు టిక్కెట్లు చాలా వరకు అమ్ముడైనట్టు సమాచారం. మొదటి రోజు దాదాపు హౌస్ ఫుల్ హౌస్ అవుతుందని అంచనా. పెర్త్, అడిలైడ్‌లలో జరిగిన మొదటి రెండు టెస్టులకు కూడా విశేష స్పందన వచ్చింది. దీంతో మూడో మిగిలిన టెస్టులకు భారీ క్రేజ్ నెలకొంది.