సీనియర్లకు మొండి చెయ్యి చూపిన చంద్రబాబు..!

చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న టీడీపీ, జనసేనల ఉమ్మడి జాబితా రానే వచ్చింది. 118స్థానాలకు టీడీపీ, జనసేనలు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీటు దక్కినవారు సంబరంగా ఉండగా, ఆశాభంగం కలిగిన కొంతమంది నేతలు నిరాశతో మునిగిపోతే, ఇంకొంత మంది పక్కచూపులు మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ఈ ఎన్నికల్లో చాలా మంది సీనియర్లను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కని వారిలో గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీతల సుజాత, యరపతినేని వంటి సీనియర్లు ఉన్నారు. చంద్రబాబుకు రక్త తర్పణం చేసిన బుద్ధా వెంకన్న కూడా సీటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీ సీనియర్లు ఆశిస్తున్న చాలా స్థానాల్లో జనసేన, బీజేపీలు టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో పొత్తు ధర్మం ప్రకారం సీనియర్లను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

సీటు దక్కనివారు నిరాశకు గురికావద్దని, టీడీపీ,జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అందరికీ తగిన న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. సీటు దక్కని కొంతమంది సీనియర్లు పార్టీని వీడే యోచనలో ఉన్నారని కూడా టాక్ వినిపిస్తోంది.