సాధారణంగా రక్షా బంధన్ రోజున అన్నా చెల్లెళ్లు ఏం చేస్తారు. పొద్దున లేచి..తల స్నానం చేసి..అక్కా చెల్లెళ్లు పూజలు చేసి..తమ సోదరులకు రాఖీ కడతారు. రాఖీ కట్టిన అనంతరం తమకు ఇష్టమైన స్వీటును అన్నదమ్ముళ్లకు తినిపిస్తారు. ఆ తర్వాత హారతి పట్టి..ఆశీర్వాదం ఇస్తారు. కానీ ఇక్కడ ఓ చెల్లె మాత్రం..తన అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాత ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది. అందరూ తినిపించినట్లుగా స్వీటు తినిపించకుండా..అన్నయ్యకు ఏం తినిపించిందో చూస్తే..మీరుకు షాక్ అవుతారు.
ALSO READ:తునికాకు బోనస్ ఇవ్వాలని కూలీల ధర్నా
ఓ వీడియోలో ఓ చెల్లెలు తన అన్నయ్యకు రాఖీ కడుతుంది. అందుకోసం ముందుగానే ఓ ప్లేట్ లో కుంకుమ, రాఖీని తీసుకువస్తుంది. ఇక్కడ చెల్లెలు..అన్నయ్యకు బొట్టుపెడుతుంది. ఆ తర్వాత రాఖీ కట్టాలి. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా ఆ చెల్లెలు గుట్కా తినిపిస్తుంది. ఆ తర్వాత అన్నయ్యకు రాఖీ కడుతుంది. అనంతరం అన్న..చెల్లెలు పాదాలు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకుంటాడు. చివరగా గుట్కా ప్యాకెట్ అన్నయ్యకే ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
ఈ ఘటన ఎక్కడో స్పష్టంగా తెలియదు. కానీ ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం ఈ వీడియో వైరల్ అయింది. దీనికి ఇప్పటి వరకు 45 లక్షల మందికి పైగా వీక్షించారు. 2 లక్షల 56 వేలకు పైగా లైక్ కొట్టారు. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.