![జయశంకర్ పరిశోధన కేంద్రం వద్ద పులి అడుగులు](https://static.v6velugu.com/uploads/2024/01/tiger-footsteps-at-jayashankar-research-centre_sIj8dgOHv9.jpg)
వర్ని, వెలుగు: రుద్రూర్ మండలంలోని అక్బర్‌నగర్ శివారులో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్అధికారులు గుర్తించారు.
పరిశోధన కేంద్రం సమీపంలో అడవి పంది మృతిచెందిన సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ఆఫీసర్లు చంద్రప్రకాశ్, బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి అడవిపందిని పులి చంపినట్లు నిర్ధారించారు. ఆ ప్రాంత పరిసరాల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.