జగిత్యాలలో పెద్దపులి కలకలం: అవుపై దాడి చేసి చంపేసింది.. భయం గుప్పిట్లో జనం..

జగిత్యాలలో పెద్దపులి కలకలం: అవుపై దాడి చేసి చంపేసింది.. భయం గుప్పిట్లో జనం..

జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. జిల్లాలోని కొడిమ్యాల మండలం కొండాపూర్ శివారులో పెద్దపులి సంచరించింది.బుధవారం ( జనవరి 22, 2025 ) కొండాపూర్ శివారులోని పొలాల దగ్గర ఓ అవును గొంతు కొరికి చంపేసింది పెద్దపులి. సీసీ కెమెరాలలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పెద్దపులిగా నిర్దారించారు ఫారెస్ట్ అధికారులు. ఈ ఘటనతో రాత్రిపూట బయటకు వెళ్లకూడదని గ్రామ ప్రజలకు ఆదేశించిన ఫారెస్ట్ అధికారులు.

పొలం దగ్గర ఉన్న అవును గొంతు కొరికి చంపేసిన పులి.. ఆవు వెనుక  భాగం పూర్తిగా మాంసం తిని వెళ్లిపోయినట్లు తెలిపారు అధికారులు. పెద్దపులి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో అని భయాందోళనతో గడుపుతున్నామని అంటున్నారు గ్రామస్థులు. ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీ అధికారులు కొండాపూర్ ప్రాంతంలో అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.