భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం రేపుతోంది. పినపాక మండలం పోట్లపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోట్లపల్లి గ్రామంలో పులి పాద ముద్రలను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. మంగపేట,తాడ్వాయి, ఆళ్లపల్లి,కరకగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తునట్లు గుర్తించారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అడవిలోకి వెళ్లొ్ద్దని హెచ్చరించారు. ఐదు రోజుల క్రితం పులి సంచరించినట్లు అడవిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అయితే ఫారెస్ట్ లో పులి సంచరిస్తుందా? లేదా అనేని ఫారెస్ట్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు.
మరో వైపు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకం పేటలో చిరుత సంచార కలకలం రేపుతోంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తి వెంట పడింది చిరుత. లక్ష్మి నరసింహ ఆలయ దారిలో ఈ ఘటన జరిగింది. ఎదురుగా లారీ రావడంతో సమీప గుట్టల్లోకి చిరుత వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు చిరుత తిరిగిన ఆనవాళ్లను పరిశీలించారు.