ములుగు జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో పెద్దపులి సంచరిస్తోంది. ఆలుబాక- బోధాపురం మిర్చి తోటకు వెళ్ళే గోదావరి పాయలో పెద్దపులి అడుగుజాడలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో పుచ్చతోట దగ్గర పడుకున్న రైతులకు పులి అరుపులు వినిపించినట్టు చెబుతున్నారు.
Also Read :- మోహన్ బాబు ఫ్యామిలీలో ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!
డిసెంబర్ 10న ఉదయం స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుని పెద్దపులి అడుగులను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పెద్దపులి జాడ దొరికే వరకు పరిసర ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.