కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ అటవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్అధికారులు నిర్ధారించారు. కొండాపూర్ గ్రామానికి చెందిన రైతు బుధవారం రాత్రి తన పొలం వద్ద ఆవును కట్టేసి వచ్చాడు. గురువారం ఉదయం వెళ్లి చూడగా ఏదో జంతువు ఆవును చంపి తిన్నట్లు ఉండడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు.
తొలుత తోడేలు, వేట కుక్కలు దాడి చేసి చంపి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం చిరుతగా భావించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఆవు కళేబరాన్ని ఘటనా స్థలంలోనే ఉంచారు. అక్కడ మధ్యాహ్నం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఆవు కళేబరాన్ని తినడానికి పెద్ద పులి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో కొండాపూర్, దమ్మయ్యపేట, రామకృష్ణాపూర్, బొల్లోని చెరువు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా చేశారు.