
బెంబేలెత్తిస్తున్న బెబ్బులి
బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల ప్రజలను పులి భయం వెంటాడుతూనే ఉంది. తాజాగా బెల్లంపల్లి మండలం దగ్నేపల్లి అటవీ ప్రాంతంలో పులి కదలికలను ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. దీంతో బెల్లంపల్లి రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు ప్రవీణ్‌నాయక్, సతీశ్ కలిసి పులి సంచరించిన ప్రాంతాల్లో పర్యటించి పాదముద్రలను పరిశీలించారు.
పులి రక్షణకు చర్యలు చేపట్టారు. పులి సంచరిస్తున్న ప్రాంతం సమీపంలోని చర్లపల్లి, మాలగురిజాల, రంగపేట, నెన్నెల మండలం నందులపల్లి గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.