బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడమే కాదు.. ప్రతి పండక్కి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తున్నాడు రవితేజ. ఉగాది సందర్భంగా నిన్న కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టిన చిరంజీవి ప్రీ లుక్‌ని కూడా లాంచ్ చేశారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్ర్కిప్ట్ అందించాడు. చిత్ర సమర్పకుడు తేజ్ నారాయణ్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ ‘ప్యాండమిక్ కంటే ముందు ఈ కథ నాకు వినిపించాడు వంశీ. కుదరక చేయలేదు. అయితే ఈ స్టోరీకి రవితేజ కరెక్ట్‌గా సూటవుతాడు. స్టూవర్ట్‌పురం టైగర్ నాగేశ్వరరావు గురించి నేను చిన్నప్పుడే విన్నాను. ఆయన గురించి చాలా హీరోయిక్‌గా చెప్పుకునేవారు. ఆయన కథతో సినిమా తీయడం ఆనందంగా ఉంది. ‘కశ్మీర్ ఫైల్స్’తో ఆల్రెడీ సక్సెస్ మూడ్‌లో ఉన్న అభిషేక్ అగర్వాల్‌కి ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా’ అన్నారు. తమ డెబ్యూ మూవీ రవితేజతో చేయడం హ్యాపీగా ఉందన్నారు హీరోయిన్స్ నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్. కీలక పాత్రలో నటిస్తున్న రేణూ దేశాయ్ మాట్లాడుతూ ‘మూడేళ్ల క్రితం వంశీ నాకీ రోల్ గురించి చెప్పారు. అప్పటికి నాకు యాక్టింగ్ చేయాలనే ఆలోచన లేదు. కానీ స్టోరీతో పాటు క్యారెక్టర్ బాగా నచ్చడంతో కమిటయ్యాను’ అని చెప్పింది. ‘ఇది డిఫరెంట్ ఫిల్మ్. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను’ అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. నిర్మాతలు సునీల్ నారంగ్, విష్ణు ఇందూరి, దర్శకులు తేజ, శరత్ మండవ, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.
టైగర్‌కి టైమొచ్చింది
- టాకీస్
- April 3, 2022
లేటెస్ట్
- నార్సింగిలో చైన్ స్నాచింగ్.. మహిళ మెడలోంచి 5తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దొంగ
- స్టార్ హీరో సినిమాకి బడ్జెట్ కష్టాలు.. రిలీజ్ అవ్వడం కష్టమే..?
- తండేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్.. రూ.100 కోట్లు కొడుతుందా.?
- జనాభా లెక్కలు తీయనిది.. వర్గీకరణ ఎలా చేస్తారు.?: ఎమ్మెల్యే వివేక్
- రాజ్యాంగ స్ఫూర్తితో జీవిస్తున్నాం: ప్రధాని మోదీ
- అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్..శ్రీధర్ బాబు కౌంటర్
- మూడు గ్రూపులుగా ఎస్సీలు..ఎవరికి ఎంత రిజర్వేషన్ అంటే.?
- SA20: సన్ రైజర్స్‌తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
- చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం
- జైలుకెళ్లోచ్చిన తర్వాత షూటింగ్ కి వచ్చిన జానీ.. అలా చేసేసరికి ఏడుస్తూ ఎమోషనల్..
Most Read News
- Good Health: ప్రతిరోజూ రాత్రి రెండు యాలకలు తిని పడుకోండి.. ఎన్ని లాభాలో..
- ఐకానిక్ బ్రిడ్జికి లైన్ క్లియర్! నెలాఖరులోగా టెండర్లు .. తెలంగాణ – ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ప్రాజెక్ట్
- Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు
- Ricky Ponting: సచిన్, బ్రాడ్‌మాన్ కాదు.. అతడే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్: రికీ పాంటింగ్
- హిందూ బీసీలు..ముస్లీం బీసీలు ఉంటారా?.. సర్వే చూసి బాధపడ్డాం: పాయల్ శంకర్
- రూ.85 వేల పైన గోల్డ్ ధర.. గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం ఇదే..
- Pushpa2TheRule: రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్.. పుష్పరాజ్ విధ్వంసానికి ఈ వీడియో ఉదాహరణ
- కార్పొరేషన్ లో విలీనమైనా గ్రామపంచాయతీ పన్నులే
- కంప్లైంట్ చేస్తే సచ్చిపోతానని వీడియో కాల్.. మళ్లీ దొరికిపోయిన మస్తాన్ సాయి !
- SamanthaRuthPrabhu: సమంత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. స్టన్నింగ్ గా కొత్త లుక్