రవితేజ అడిగారు.. ఫ్యాన్స్ చెప్పారు.. ఆ విషయంలో ఫ్యాన్స్దే ఫైనల్ డెసిషన్

మాస్ మహారాజ రవితేజ(Raviteja) నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao). అక్టోబర్ 20న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ చాలా కాలంగా వైట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేయగా.. ఇప్పుడు ట్రైలర్ పై క్యూరియాసిటీ పెరిగింది. 

ఈ నేపథ్యంలోనే టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రిలీజ్ ను తన ఫ్యాన్స్ కే వదిలేశారు రవితేజ. ఫ్యాన్స్ ఎప్పుడంటే అప్పుడే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ఎప్పుడు కావాలని ఫ్యాన్స్ నుండి అభిప్రాయ సేకరణ కూడా చేశారు. ఇందులో చాలా మంది సెప్టెంబర్ 27వ డేట్ ను సూచించారు. దీంతో ఈ డేట్ నే టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రిలీజ్ కానుందంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Also Read :- రూల్స్ రంజన్ కు రవితేజ విషెస్

ఇక టైగెర్ నాగేశ్వరరావు సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరక్కుతున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.