
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్, ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల గ్రామాల అడవుల్లో పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పది రోజులుగా బెల్లంపల్లి డివిజన్లోని అడవుల్లో సంచరించిన పులి పొట్యాల అడవుల్లోకి వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
మంగళవారం చెన్నూర్ఎఫ్డీఓ సర్వేశ్వర్రావు, మంచిర్యాల రేంజ్ఆఫీసర్ రత్నాకర్ సిబ్బందితో వెళ్లి చిత్తాపూర్ కలి చెరువు వద్ద పులి పాదముద్రలు గుర్తించినట్లు నీల్వాయి రేంజ్అధికారి అప్పలకొండ తెలిపారు. పులి జాడ ముమ్మరంగా గాలిస్తున్నట్టు చెప్పారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.