వేములవాడ అడవుల్లో పులి సంచారం

వేములవాడ అడవుల్లో పులి సంచారం

వేములవాడరూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్​ మండలం ఫాజుల్​నగర్  అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్​ అధికారులు గుర్తించారు. రెండు రోజుల కింద గేదెపై పులి దాడి చేయగా, ఫారెస్ట్​ అధికారులు పాదముద్రలు, ఆనవాళ్లు సేకరించారు. పులి సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. 

ఫాజుల్​నగర్​ గ్రామం నుంచి కొండాపూర్  అటవీ ప్రాంతం వరకు ఉన్న గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్వో ఖలీలోద్దీన్​ సూచించారు. పొలాల వద్దకు రైతులు గుంపుగా వెళ్లాలన్నారు. పులికి సంబంధించిన సమాచారం తమకు అందించాలని సూచించారు.‌‌