వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!

వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!

వరంగల్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నల్లబెల్లి ముండలం కొండాపూర్, రుద్రగూడెం గ్రామ శివారులో పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. స్థానికంగా ఉన్న పంటపొలాల్లో పులి పాఠముద్రలను ఆఫీసర్లు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో. రైతులు, స్థాని కులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు రుద్రగూడెం పరిసర ప్రాంతాల్లో ఇవాళ చిరుతపులి సంచరిస్తుండ న్న ప్రచారంలో కూలీ పనులకు వెళ్లిన వాడు భయంతో ఇంటి బాట పట్టారు. రైతులు వ్యవ సాయ పంట భూముల్లో ఒకేచోటకి చేరుకొని పులి అడుగులపై చర్చించుకుంటూ భయందోళన చెందుతున్నారు. 

ALSO READ | వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

 ఇటీవల తాద్వాయి అడవుల్లో సంచరించిన పెద్దపులి మళ్లీ జాడ లేకుండా పోవడం అనుమానాలకుతావిస్తోంది. 10 రోజులుగా వైల్డ్ లైఫ్ అధికా రులు పులి పాదముద్రలను గుర్తించగా, గత శనివారం బర్మాల అటవీ ప్రాంతం మీదుగా లింగాల అడవుల్లోకి వెల్లినట్లు చెబుతున్నారు. అప్పటినుంచి కదలికలు కానరాకపోవడంతో పెద్దపులి క్షేమమేదా? వేటగాళ్లతో ప్రమాదం పొంచి ఉందా? అనే ప్రశ్నలు తలెతుత్తున్నాయి.