ఆదిలాబాద్ జిల్లా తాంసి–కే తో పాటు పెన్ గంగా పరివాహక ప్రాంతంలో పులుల సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. నాలుగు పులులు సంచరిస్తుండగా చూసినట్లు స్థానికులు, పిప్పల్ కోటి రిజర్వాయర్ కార్మికులు చెబుతున్నారు. కొన్ని రోజుల నుంచి పులులు ఆ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని పశువులపై దాడులు చేస్తున్నాయని అంటున్నారు. పులులు తిరుగుతుండటంతో గ్రామ ప్రజలు, రైతులు, కూలీలు భయాందోళనలకు గురవుతున్నారు.