
వనపర్తి, వెలుగుః మార్చి -2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తికి రానున్న దృష్ట్యా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు.
పబ్లిక్ మీటింగ్ సంబంధించిన స్థలాలను భద్రతా ఏర్పాట్లను చూశారు. పబ్లిక్ మీటింగ్ వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొత్తకోట రోడ్డు పెబ్బేర్ రోడ్డు పానగల్ రోడ్ గోపాల్ పేట్ రోడ్ పార్కింగ్ స్థలాలు, ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో బాయ్స్ హైస్కూల్ కు శంకుస్థాపన, భూమి పూజ చేయనున్నారు.
నేడు మంత్రి, ఎంపీ రాక
సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించే పాలిటెక్నిక్ కాలేజీలోని సభా స్థలాన్ని బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూలు ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించనున్నారు.