
కరీంనగర్ క్రైం, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు.
ఆలయం, కల్యాణ మండపం, వీఐపీ గ్యాలరీలను ఆదివారం హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జితో కలిసి పర్యవేక్షించారు. కల్యాణ మండపానికి వెళ్లే ప్రవేశ మార్గం వద్ద ఏర్పాటు చేసిన డీఎఫ్ ఎండీలు, సీసీ కెమెరాల పనితీరును, ఆలయ పరిసరాలను స్వయంగా పరిశీలించారు.