గ్రూపు 2 సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు : సీపీ అనురాధ

గ్రూపు 2 సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటలోని 37 గ్రూప్​2 సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. శుక్రవారం ఆమె సీపీ ఆఫీస్​లో బందోబస్తు నిర్వహించే పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. బందోబస్తు విషయంలో  ఏవైనా సమస్యలు ఉంటే  పోలీస్ నోడల్ అధికారి, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ను అడిగి తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు.

అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దన్నారు. సమయానికి ముందే సెంటర్ల వద్దకు చేరుకోవాలన్నారు. సమావేశంలో ఎగ్జామ్ పోలీస్ నోడల్ అధికారి అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీశ్, సుమన్ కుమార్, ఇన్​స్పెక్టర్లు శ్రీధర్, కమలాకర్, రామకృష్ణ, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్ పాల్గొన్నారు.