సర్కారు కాలేజీల్లో బదిలీలు చేపట్టాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు నిర్వహించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసి యేషన్ (టిగ్లా) కోరింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జంగయ్య, రామకృష్ణగౌడ్ ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. ఐదేండ్లుగా బదిలీలు జరగకపోవడంతో ఉద్యో గులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. 

ALSO READ :వెయ్యి కోట్లు ఇస్తామన్నరు.. ఒక్క పైసా ఇయ్యలే

2018 జూన్​నెల లో సాధారణ బదిలీలు జరిగాయన్నారు. జీవో 317 అమలు, పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచడం ద్వారా కుటుంబాలకు దూ రంగా చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీస్​ను రెగ్యులర్​ చేసిందని,  వారంతా సుమారు 20 ఏండ్ల నుంచి ఒకే కాలేజీలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.