సుఖేష్ చంద్రశేఖర్‌కు కూలర్ ఇవ్వండి.. తీహార్ జైలుకు కోర్టు ఆదేశం

సుఖేష్ చంద్రశేఖర్‌కు కూలర్ ఇవ్వండి.. తీహార్ జైలుకు కోర్టు ఆదేశం

లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌కు  ఎయిర్ కూలర్ అందించాలని ఢిల్లీ కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. జైలులో అధిక వేడి కారణంగా తనకు చర్మ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు సుఖేష్ చంద్రశేఖర్. పిటిషన్ ను విచారించిన  పాటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి (ASJ) చందర్ జిత్ సింగ్ ..వేడిగాలులు ఉన్నందున తన స్వంత ఖర్చుతో ప్రైవేట్ కూలర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చింది.

 మండోలి జైలులో సెంట్రల్ కూలింగ్ సిస్టమ్‌ను ఉద్దేశపూర్వకంగా స్విచ్ ఆఫ్ చేసిందని  చంద్రశేఖర్ తరపు  న్యాయవాది  వాదించారు. అధిక వేడి వల్ల చర్మంపై దద్దుర్లు, లో బీపీతో  ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చంద్రశేఖర్ వాదించారు. ఈ వాదనలను డాక్టర్లు ధృవీకరించారు.

 చంద్రశేఖర్ కు  బీపీ సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉందని..మరింత ఆరోగ్యం క్షీణించకుండా ఉండేందుకు తన గదిలో చల్లటి వాతావరణం ఉండేలా చూడాలని న్యాయమూర్తి సింగ్ జైలు అధికారులను ఆదేశించారు. అవసరమైతే  వైద్య సలహాకు అనుగుణంగా తన స్వంత ఖర్చుతో ఒక ప్రైవేట్ కూలర్‌ను ఏర్పాటు చేసుకోవడానికి చంద్రశేఖర్ కు  అనుమతించాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలతో చంద్రశేఖర్ 2019 అక్టోబర్‌లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి  తీహార్ జైలులో ఉన్నాడు.