అమెరికాలో టిక్ టాక్ బంద్.. ఆ రోజు నుంచి నిలిచిపోనున్న సేవలు..?

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాలో ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ బ్యాన్ కానున్నట్లు తెలుస్తోంది. 2025, జనవరి 19వ తేదీ నుండి అమెరికాలో టిక్ టాక్ సేవలు నిలిచిపోనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టమే. దేశ పౌరుల రక్షణను దృష్టిలో పెట్టుకుని సామాజిక మాధ్యమాలకు సంబంధించి 2024 ఏప్రిల్‎లో జో బైడెన్ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకువచ్చింది. 

ఈ చట్టం ప్రకారం.. టిక్‌టాక్‌ను చైనా మాతృ సంస్థ బైట్‌డాన్స్ నుంచి విక్రయించాలి. లేదంటే టిక్ టాక్ యుఎస్‎లో నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జో జోడైన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు టిక్‌టాక్‌ను చైనా మాతృ సంస్థ బైట్‌డాన్స్ విక్రయించేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఇక 2025, జనవరి 19వ తేదీ నుంచి అమెరికాలోయాప్ ‎సర్వీసులను నిలిపివేయాలని టిక్ టాక్ యోచిస్తోంది.

ALSO READ | ప్రపంచం నివ్వెరపోతుంది: మంటల్లో ఆ ఇల్లు తప్ప.. అన్నీ బూడిదే.. ఈ అద్భుతం దేవుడి మహిమేనా..?

యూఎస్‌లో టిక్‌టాక్ షట్ డౌన్ అయినట్లయితే అక్కడి వ్యక్తులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేరు. ఇప్పటికే ఫోన్లలో యాప్‌ ఉంటే.. కొంత కాలం పాటు పని చేసిన తర్వాత సర్వీసులు నిలిచిపోనున్నాయి. కొత్త ఫోన్లనో ఇకపై టిక్ టాక్ డౌన్ లోడ్ కాదు. మరోవైపు ఈ చట్టం అమలు చేయడానికి కొంత సమయం కావాలని కంపెనీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. అయితే.. అమెరికాలో టిక్ టాక్‎ను నిషేదించడానికి బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌  చైనా మాతృ సంస్థ బైట్‌డాన్స్‎కి  చెందినది. ఈ యాప్ ద్వారా అమెరికా పౌరుల వ్యక్తిగత డేటాను చైనా సేకరించే అవకాశం ఉందని.. ఇదే జరిగితే పెను ప్రమాదమని భావించిన బైడెన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రక్షణ, ఆర్థిక రంగాల్లో చైనా, అమెరికా మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం అమెరికా మోస్తోన్న ప్రపంచ పెద్దన్న పాత్రను పోషించాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. దీంతో డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు యూఎస్ ప్రతివ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా బ్యాగ్రౌండ్ ఉన్న టిక్ టాక్‎ను యూఎస్ లో బ్యాన్ చేసింది.