కళ్లతోనే వెయ్యి భావాలు పలికిస్తుంది. ఎంతటి డైలాగ్ అయినా చక్కగా చెప్పేస్తుంది. సెంటిమెంట్, లవ్, కామెడీ ఏదైనాసరే.. యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఇదంతా ఏ హీరోయిన్ గురించో అనుకుంటున్నారా..? కానే కాదు. కేరళలోని డిఫరెంట్లీ ఎబుల్డ్ పర్సన్ చాందిని నాయర్ గురించి. తన లోపాన్ని మరిచి, టిక్ టాక్ వీడియోలు చేస్తూ స్టార్‌గా మారింది.
నా లాంటి ‘‘డిఫరెంట్లీ ఎబుల్డ్ పర్సన్స్ చాలామంది ఉంటారు. అందుకే ఆ విషయాన్ని మరిచి భవిష్యత్తుపై దృష్టిపెట్టేదాన్ని. వైకల్యం కారణంగా చిన్నప్పుట్నుంచే ఎన్నో ఇబ్బందులు పడ్డా. సూళ్లలో అడ్మిషన్ కూడా దొరకలేదు. ఎన్నో స్కూళ్లు ‘నో’ చెప్పాయి. నాలాంటివాళ్లే చదువుకునే స్కూళ్లో అడ్మిషన్ దొరికింది. పెరిగి పెద్దయ్యాక కూడా ఇబ్బందులు తప్పలేదు. ఇంటర్లో 90 శాతం పర్సెంటేజీ తెచ్చుకున్నా.. అయినా ఇబ్బందులు తప్పలేదు. కండరాల బలహీనత వల్ల చిన్నప్పట్నుంచే వీల్‌చైర్‌కే పరిమితం. ఈ ఒక్క కారణంతోనే అడ్మిషన్ ఇవ్వలేదు. మారాల్సింది నేను కాదు.. లోపాన్ని సాకుగా చూపే ఎదుటివాళ్లు అని తెలుసుకున్నా. ఎన్నో అడ్డంకులు దాటుకొని ఫార్మసీలో డిగ్రీ చేస్తున్నా.
హాబీగా మొదలై..
నాకు చిన్నప్పట్నుంచే పాటలు పాడటం అంటే ఇష్టం. టీవీలో ప్లే అయ్యే సాంగ్స్‌ను మ్యూట్‌లో పెట్టి, హమ్ చేసేదాన్ని. ఎన్నో పాటలు పాడా. నా టాలెంట్‌ను గుర్తించి పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు. అలా పాటలపై ఇష్టం పెంచుకొని క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నా. ఎంతో టాలెండ్ ఉండి కూడా నా డిజేబిలిటీ కారణంగా స్టేజీ షోలు చేయలేకపోయా. పాటలపై ఇష్టం చంపులేకపోయేదాన్ని. ‘డబ్స్మాష్’ యాప్ నన్ను వెలుగులోకి తెచ్చింది. ఆ యాప్ నాకు చాలా బాగా నచ్చింది. ముప్పై సెకన్లు నిడివి ఉన్న వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టేదాన్ని. ‘వెరైటీ మీడియా’ ఫేస్బుక్ పేజ్‌లో పోస్టు చేసేదాన్ని. నా వీడియోలు నచ్చి చాలామంది షేర్ చేసేవాళ్లు. అదే నా లైఫ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. నాలుగు రోజుల్లోనే నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వీడియో మేకింగ్‌లో ఫేస్ మాత్రమే కవర్ చేసేదాన్ని. చాలామందికి నేను డిజేబుల్డ్ అనే విషయం కూడా తెలియదు. లోకల్ మీడియా నన్ను గుర్తించడంతో వీడియోలకు బాగా రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి యాక్టివ్‌గా వీడియోలు చేస్తున్నా. వీడియోలన్నీ వైరల్‌గా మారడంతో 7.7 వేల ఫాలోవర్స్ ఉన్నారు.
నేను పుట్టింది కేరళ అయినా, పెరిగింది మాత్రం తమిళనాడులో. నా లోపం గురించి తెలిసి చాలామంది జాలి చూపేవాళ్లు. అమ్మానాన్న మాత్రం మామూలు చైల్డ్గానే పెంచారు. నాకు ఫ్రీడం ఇచ్చారు. వాళ్ల వల్లే నా హాబీ కొనసాగింది. జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. టిక్‌టాక్ వీడియోలు చేస్తూనే, స్టడీస్ కంటిన్యూ చేస్తున్నా. డాక్టర్ కావడమే లక్ష్యం” అంటూ జర్నీ గురించి చెప్పింది చాందినీ నాయర్.