
భారత్ లో టిక్ టాక్ జర్నీ ముగిసింది. చైనాకు చెందిన 59 యాప్స్ వల్ల వ్యక్తిగత సమాచారం పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో కేంద్రం చైనా యాప్స్ ను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ 59యాప్స్ లలో టిక్ టాక్ కూడా ఉంది. తాజాగా ఈ టిక్ టాక్ ను గూగుల్ ,యాపిల్ యాప్ స్టోర్ తొలగించాయి. దీంతో టిక్ టాక్ పనిచేయడం ఆగిపోయింది. ఫోన్ లో టిక్ టాక్ ను రిమూవ్ చేయకుండా..ఆపరేట్ చేసేందుకు ప్రయత్నించినా నో నెట్ వర్క్ కనెక్షన్ అనే మెసేజ్ డిస్ ప్లే అవుతోంది. అన్నీ సర్వీస్ ప్రొవైడర్లు టిక్ టాక్ యాప్ సర్వర్‌కు కనెక్ట్ కాకుండా ఇంటర్నెట్‌ను నిలిపివేశాయి. దీంతో భారత్ లో టిక్ టాక్ జర్నీ ముగిసినట్లైంది.