
న్యూజెర్సీలో ఒక హోం డిపోలో ఉండే పిల్లి ఆన్లైన్ స్టార్ అయ్యింది. పిల్లి సోషల్ మీడియా సెలబ్రిటీ ఎలా అయిందబ్బా! అని ఆలోచించే వాళ్లకు ఇంకో స్పెషల్ న్యూస్ ఏంటంటే... లియో అనే పేరున్న ఆ పిల్లి సెలబ్రిటీ కావడమే కాదు. ఆ స్టోర్‌కి కొత్త కస్టమర్లను కూడా తెచ్చిపెడుతోంది మరి. లియో అనే ఈ పిల్లి టిక్‌టాక్ వీడియోలను జెఫ్రీ సింప్కిన్స్ అనే అతను పోస్ట్ చేయడంతో అవి చాలా వైరల్ అయ్యాయి. ఈ పిల్లి అతనికి మొదటిసారి ఆగస్టు నెలలో మౌంట్ లారల్ స్టోర్‌లో కనిపించింది.
దాన్ని చూడడంతోనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందట జెఫ్రీకి. అందుకే దాన్ని వెంటనే వీడియో తీసి టిక్‌టాక్‌లో ఎక్కించాడు. మొట్టమొదటి వీడియోకు 4.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నిజానికి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు దీనికి ఒక వెయ్యి వ్యూస్ వచ్చినా ఎక్కువే అనుకున్నాడట అతను. ఇప్పుడు లియోకి ప్రత్యేకంగా ఫ్యాన్ మెయిల్ తయారైంది. లిమో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ హోండిపోకు వచ్చిన కస్టమర్లను తెగ ఎంటర్టెయిన్ చేస్తుంటుంది.
మిగతా పిల్లులకు మల్లే బట్టలు వేసుకుని. స్టోర్‌లో రకరకాల ప్లేస్ల్లో నిద్రపోతుంటుంది. దీని గురించి ఆ స్టోర్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ ‘‘ఈ స్టోర్‌లో ఎలుకల బెడద తగ్గించేందుకు తీసుకొచ్చి ఏడాది అవుతోంది. ఇక్కడి ఉద్యోగులే లియో బాగోగులు చూసుకుంటారు. రెగ్యులర్‌గా వెట్ చెకప్స్ చేయిస్తుంటారు. స్టోర్ క్లోజ్ చేసినప్పుడు, సెలవుల్లో అది పడుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసి పెడతారు. కొందరు కస్టమర్లయితే ‘లియోను చూసేందుకే స్టోర్‌కి వచ్చామ’ని చెప్తారు.