అమెరికాలో టిక్‌‌టాక్ క్లోజ్​

అమెరికాలో టిక్‌‌టాక్ క్లోజ్​

వాషింగ్టన్​:  ప్రముఖ వీడియో-షేరింగ్ ప్లాట్‌‌ఫామ్‌‌ టిక్​టాక్​సేవలను అమెరికాలో క్లోజ్ చేశారు. అమెరికా తీసుకొచ్చిన నిషేధ చట్టం అమలులోకి రావడంతో శనివారం రాత్రి నుంచి తమ సేవలను షట్​డౌన్ చేసినట్టు టిక్​టాక్ మాతృసంస్థ బైట్​డాన్స్ ప్రకటించింది. యూజర్లు యాప్ ఓపెన్ చేయగానే “దురదృష్టవశాత్తు యూఎస్​లో టిక్‌‌టాక్‌‌ను నిషేధించే చట్టం జనవరి 19 తేదీ నుంచి అమలులోకి వచ్చింది, కనుక ప్రస్తుతానికి మీరు టిక్‌‌టాక్‌‌ను ఉపయోగించలేరు” అనే సందేశం స్క్రీన్​పై చూపుతున్నది. 

ప్రెసిడెంట్ బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో సేవలను నిలిపి వేయడం తప్ప మరోమార్గం లేకుండా పోయిందని వెల్లడింది. “కొత్త ప్రెసిడెంట్​గా ఎన్నికైన ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టిక్‌‌టాక్‌‌ను పునరుద్ధరించే అంశంపై మాతో కలిసి పనిచేస్తానని చెప్పడం మా అదృష్టం. దయచేసి వేచి ఉండండి!” అని డేటా డాన్స్ ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్​ఈమెయిల్​లో పేర్కొంది. 

టిక్​టాక్​యాప్​ను నిషేధిస్తూ అమెరికా తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సమర్థిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. తమ యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్ ను తొలగించాలని యాపిల్, గూగుల్ సంస్థలను ఆదేశించింది. టిక్‌‌టాక్ యాప్ కు బ్యాక్-ఎండ్ క్లౌడ్ ప్రొవైడర్ గా ఉన్న ఒరాకిల్‌‌, వెబ్-హోస్టింగ్ సంస్థలు తమ సపోర్ట్ నిలిపివేయాలని పేర్కొంది. ఆదేశాలను పాటించకపోతే బిలియన్ల డాలర్ల జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తీర్పులో తెలిపింది.