టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది.ప్రముఖ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీ వరకు వర్క్ ఫోర్స్ తగ్గించుకుంటున్నాయి. కంపెనీ నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు కొన్ని కంపెనీలు ఎంప్లాయీస్ కు లేఆఫ్ ఆర్డర్లను పంపిస్తుంటే..మరొకొన్ని కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకునే క్రమంలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.. కంపెనీల నిర్ణయాలతో టెకీల్లో ఆందోళన రేకిస్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గత మూడేళ్లలో లక్షల్లో ఉద్యోగులను తొలగించాయి ఐటీ కంపెనీలు. తాజాగా టిక్ టాక్ మలేషియా తన వర్క్ ఫోర్స్ ను తగ్గించుకునేందుకు 700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
టిక్ టాక్ లో కంటెంట్ మోడరేషన్ విభాగంలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమైంది. ఉద్యోగుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని వినియో గించేం దుకు సిద్ధమవుతుంది. AI లో పెట్టుబడులుపెట్టే ప్రయత్నిస్తున్న కంపెనీ తన 700 ఉద్యోగులను తొలిగిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ లో ఈ తొలిగింపులు ఉండొచ్చని తెలుస్తోంది.
Also Read:-ఈ చికిత్స చేయించుకుంటే..ఎప్పటికీ ముసలోళ్లుకారా!
టిక్ టాక్ తన ప్లాట్ ఫాంలో కంటెంట్ ను సమీక్షించేందుకు మాన్యువల్ మోడరేటర్లతోపాటు ఆటోమేటెడ్ డిటెక్షన్ పై ఆధారపడి పనిచేస్తుంది. అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు కంటెంట్ నియంత్రణ కోసం ఆపరేటింగ్ మోడల్ ను మెరుగుపర్చేందుకు రెడీ అయింది. సెక్యూరిటీ, ట్రస్ట్ , స్ట్రెంత్ ను మెరుగుపర్చేందుకు 2బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు యోచిస్తోంది.