ప్రముఖ టిక్‌టాకర్ (TikToker) కార్ల్ ఈస్వెర్త్ కారు ప్రమాదంలో మరణించాడు. అతని వయస్సు 35ఏళ్లు. ఈ ఘటన జూన్ 6న జరిగింది.
ఈస్వెర్త్ నివసించే పెన్సిల్వేనియా స్నైడర్ కౌంటీలోనిరూట్ 11, కౌంటీ లైన్ రోడ్ కూడలిలో ఈ ప్రమాదం జరిగిందని అతని తల్లి జానెట్ తెలిపారు. ఈ ప్రమాదంలో తన స్నేహితుడు కూడా ఉన్నారన్నారు. వారిద్జరూ మరొక వాహనంలో ఇరుక్కుపోయి చనిపోయారని ఆమె వెల్లడించారు.
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ వాహనాలు ఢీకొన్నట్లు వార్తలు వచ్చాయి. 35 ఏళ్ల ఈ కంటెంట్ క్రియేటర్ ఈ ప్రమాదానికి ముందు వరకు టిక్‌టాక్‌లో సుమారు 5లక్షల మంది ఫాలోవర్ లను కలిగి ఉన్నారు. అతని మరణం తరువాత కుటుంబం అతని పేజీని నడుపుతుందో లేదో తనకు ఇంకా తెలియదని అతని తల్లి చెప్పింది.