సోషల్ మీడియా గాసిప్ ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రముఖ టిక్ టాక్ స్టార్ కైల్ మారిసా రోత్ వారం రోజుల క్రితం చనిపోయింది. కానీ ఈ విషయాన్ని ఆమె సోదరి మంగళవారం తెలిపింది. కైలీ మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనైయారు. ఈ విషయాన్ని కైలీ సోదరి, తల్లి సోషల్ మీడియాలో ప్రకటించారు. కైల్ తన హాస్యం, తెలివితేటలు, అందం, గాసిప్ యాక్టివిజం, అథ్లెటిసిజం వంటి వాటితో చాలా ఫేమస్ అయినట్లు ఆమె లిండ్సే రోత్ అన్నారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు మాత్రం చెప్పలేదు. కైలీ లేని లోటుతో ఆమె సోదరి లిండ్సే రోత్, తల్లి నటి జూలీ ఫాక్స్ దు:ఖంలో ఉన్నారు. ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటూ వారు బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.