ఈసారి మోస్ట్ పాపులర్ వెబ్ సైట్ డొమైన్ గా గుర్తింపు
న్యూఢిల్లీ: షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఈ ఏడాది మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్ డొమైన్‌గా నిలిచింది. గత కొన్నేళ్ల నుంచి టాప్ పొజిషన్‌లో నిలుస్తున్న గూగుల్‌ను ఈ కంపెనీ అధిగమించింది. కిందటేడాది ఈ లిస్టులో గూగుల్ టాప్ పొజిషన్‌లో ఉండగా, టిక్‌టాక్ ఏడో ప్లేస్‌లో ఉంది. వెబ్ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ ఈ విషయాలను బయటపెట్టింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరి 17 న మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్‌గా టిక్‌టాక్ నిలిచింది. ఒక రోజు పాటు ఇదే ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత మార్చిలో కొన్ని రోజులు టాప్ పొజిషన్‌లో కొనసాగింది. కానీ, ఈ ఏడాది ఆగస్ట్ 10 తర్వాత నుంచి టిక్‌టాక్ రోజులు స్టార్టయ్యాయి’ అని క్లౌడ్‌ఫ్లేర్ పేర్కొంది. ‘కొన్నిసార్లు గూగుల్ టాప్ ప్లేస్‌లో కొనసాగింది. కానీ, అక్టోబర్, నవంబర్ మాత్రం టిక్‌టాక్‌దే’ అని ఈ సంస్థ వివరించింది. థ్యాంక్స్ గివింగ్ (నవంబర్ 25), బ్లాక్ ఫ్రైడే (నవంబర్ 26) రోజుల్లో టిక్‌టాక్ హవా కొనసాగింది. మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్ డాట్ కామ్ గూగుల్ తర్వాత ప్లేస్ (3) లో ఉంది. మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ (4), యాపిల్ డాట్ కామ్ (5), అమెజాన్ (6) లు ఆ తర్వాత పొజిషన్లలో ఉన్నాయి.
ఇండియాలో బ్యాన్ చేసినా పాపులరే
గ్లోబల్‌గా చూస్తే మోస్ట్ పాపులర్ మెసెంజర్‌గా వాట్సాప్ నిలిచింది. ఈ కంపెనీ పాపులర్ వెబ్‌సైట్ డొమైన్ లిస్టులో 10 వ ప్లేస్‌లో ఉంది. ట్విటర్ తొమ్మిదో ప్లేస్‌ను దక్కించుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఏడో ప్లేస్‌ను, యూట్యూబ్ 8 వ ప్లేస్‌ను దక్కించుకున్నాయి. ‘ఫేస్‌బుక్‌ను దాటి మోస్ట్ పాపులర్ సోషల్ మీడియాగా టిక్‌టాక్ నిలిచింది’ అని క్లౌడ్‌ఫ్లేర్ తన బ్లాగ్‌లో పేర్కొంది. కరోనా సంక్షోభం టైమ్‌లో టిక్‌టాక్ కస్టమర్లు భారీగా పెరిగారు. ప్రస్తుతం కంపెనీకి గ్లోబల్‌గా 100 కోట్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కాగా, సెక్యూరిటీ కారణాలతో టిక్‌టాక్‌ను ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అయినప్పటికీ గ్లోబల్‌గా మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్‌గా నిలవడం విశేషం. టిక్‌టాక్‌కు యూఎస్, యూరప్, బ్రెజిల్, సౌత్‌ఈస్ట్ ఏసియాలు అతిపెద్ద మార్కెట్‌లుగా ఉన్నాయి.