ఎగ్ క్రాక్ ఛాలెంజ్ : మీరూ ట్రై చేస్తారా.. : సోషల్ మీడియా ట్రెండింగ్ ఇదే...

ఎగ్ క్రాక్ ఛాలెంజ్ : మీరూ ట్రై చేస్తారా.. : సోషల్ మీడియా ట్రెండింగ్ ఇదే...

ఎగ్ క్రాక్ ఛాలెంజ్.. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో.. ఎగ్ క్రాక్ ఛాలెంజ్ ఏంటీ అంటారా.. సింపుల్ అండీ.. కోడి గుడ్డును.. మీ నెత్తిన కొట్టుకోవటం అన్న మాట. ఇందులో కొత్తేమీ లేకపోయినా.. ఇప్పుడు మాత్రం ఇదే ట్రెండ్ కావటం విశేషం. ఇంట్లోని తల్లులు అందరూ తమ తమ పిల్లల నుదుటపై ఎగ్ క్రాక్ చేయటం అన్న మాట.. ఎవరు పుట్టించారో ఏమో.. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఎగ్ క్రాక్ చాలెంజ్ చేస్తూ.. నెటిజన్లను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

ఎగ్ క్రాక్ ఛాలెంజ్ లో కోడి గుడ్డు పగలకొట్టటం అనేది రొటీన్ అయినా.. ఆ సమయంలో పేరంట్స్, పిల్లల ఎమోషన్స్, నవ్వులు, వారి హావభావాలు అనేవి హైలెట్ అవుతున్నాయి. ఫన్నీగా జరుగుతున్న ఎగ్ క్రాక్ ఛాలెంజ్ ఇప్పుడు నయా ట్రెండ్ గా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలను పరిశీలిస్తే.

ఓ వీడియోలో.. ఓ మహిళ గుడ్డును బౌల్ లో పగలకొట్టే ముందు దాన్ని పక్కనే ఉన్న కొడుకు తలకు కొట్టి పగలగొడుతుంది. మరొక వీడియోలో ఓ మహిళ తన కుమార్తె తలకు కొట్టి గుడ్డును పగలగొడుతుంది. ఆ తర్వాత తన కుమార్తె చేతికి గుడ్డును పట్టించి, తన తలకు కొట్టించుకుంటుంది. అత్యంత వినోదభరితంగా కనిపించే ఈ వీడియోలను ఇప్పుడు పిల్లలు సైతం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పోస్టులు చూసిన కొందరు మాత్రం చీట్ చేస్తున్న వారి తల్లిదండ్రులపై చమత్కరామైన విమర్శలు చేస్తున్నారు. నేను నా కుక్కలతో కూడా దీన్ని చేయను" అని ఒక యూజర్ర్ వ్యాఖ్యానించగా, మరొకరు నిరాశను వ్యక్తం చేస్తూ, "కొన్ని విషయాలు ట్రెండ్‌గా ఉండవలసిన అవసరం లేదు"  అని రాసుకువచ్చారు.