
ముంబై: వచ్చే రంజీ సీజన్‌లో స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ హైదరాబాద్‌కే ఆడతాడని హెచ్‌సీఏ గురువారం (April 3) స్పష్టం చేసింది. హైదరాబాద్‌ను వీడి గోవాకు ప్రాతినిధ్యం వహిస్తాడని వస్తున్న వార్తలన్నీ కల్పితాలని హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్. దేవ్‌రాజ్ తెలిపారు. ఈ అంశంపై తిలక్‌తో వ్యక్తిగతంగా మాట్లాడానన్నారు.
టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబైని వదిలి గోవాకు ఆడతాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్పష్టం చేసింది. సూర్య ఎక్కడికీ వెళ్లడని తెలిపింది. ముంబైకి ఆడేందుకు అతను కట్టుబడి ఉన్నాడని వెల్లడించింది. మీడియాలో వచ్చిన ఈ కథనాలను సూర్యకుమార్ కూడా ఎక్స్‌లో ఖండించాడు.