న్యూఢిల్లీ: మాన్షన్ హౌస్ బ్రాందీ తయారు చేసే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ తన అమ్మకాలను భారీగా పెంచుకుంది. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాల్యూమ్‌లు ఏడాది ప్రాతిపదికన 16 శాతం వృద్ధి చెందాయి.
ఇదే కాలానికి మొత్తం ఐఎంఎఫ్ఎల్ పరిశ్రమ వృద్ధి 2-3 శాతం ఉంది. రెండో సంవత్సరంలోనూ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా నిలిచామని తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ సీఎండీ అమిత్ దహనుకర్ చెప్పారు. మాన్షన్ హౌస్ సిరీస్‌లో తాజాగా గ్రీన్ యాపిల్ ఫ్లేవర్‌ను కూడా తీసుకొచ్చామని చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో తాము నాలుగో అతిపెద్ద ‘భారత్‌లో విదేశీమద్యం తయారీ సంస్థ’ (ఐఎంఎఫ్‌ఎల్)గా నిలిచామని చెప్పారు.