డబ్లిన్: లిస్ట్–ఎ క్రికెట్ ఫామ్‌ను వన్డేల్లో కొనసాగిస్తానని ఆసియా కప్ టీమ్‌కు ఎంపికైన తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ‘వన్డేల్లో రాణిస్తానని బలంగా నమ్ముతున్నా. లిస్ట్–ఎ, స్టేట్, అండర్–19లో చాలా రన్స్ చేశా. అదే ఫామ్‌ను ఇప్పుడు వన్డేల్లోనూ కొనసాగిస్తా. ఆసియా కప్‌లో చోటు దక్కుతుందని ఎప్పుడూ కలగనలేదు.
అందులోనూ వన్డేల్లోకి వస్తానని కూడా అనుకోలేదు. వన్డేల్లో ఆడాలన్నది నా కల. అది ఇప్పుడు నెరవేరబోతున్నది. నా కెరీర్లో ఇదో పెద్ద మలుపు. ఒకే ఏడాదిలో టీ20, వన్డేల్లో డెబ్యూ చేయడం చాలా గొప్ప విషయం. ప్రస్తుతానికి ఆసియా కోసం సిద్ధమవుతున్నా’ అని తిలక్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సలహాలు, సూచనలు ఇచ్చాడన్నాడు.