నా టార్గెట్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ నెగ్గడమే

నా టార్గెట్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ నెగ్గడమే

తరౌబా: డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌, ఐపీఎల్‌‌లో మెరుపులు మెరిపించి  టీమిండియాలోకి  వచ్చిన హైదరాబాద్‌‌ యంగ్‌‌ స్టర్‌‌ తిలక్‌‌ వర్మ తొలి ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌లోనే తన బ్యాట్‌‌ పవర్‌‌ చూపెట్టాడు. వెస్టిండీస్‌‌తో  మొదటి టీ20 మ్యాచ్‌‌లో ఇండియా టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచిన తిలక్‌‌   తాను ఇంత తొందరగా నేషనల్‌‌ టీమ్‌‌లోకి వస్తానని అనుకోలేదని అంటున్నాడు. ఇక తన తదుపరి టార్గెట్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ నెగ్గడమే అని చెబుతున్నాడు. ‘దేశానికి ఆడాలని ప్రతి ఒక్కరూ కలగంటారు. నాకు ఇంత తొందరగా చాన్స్‌‌ వస్తుందని ఊహించలేదు. 

ఎందుకంటే అండర్‌‌19 వరల్డ్ కప్‌‌ తర్వాత కరోనా వైరస్‌‌ ఆటలకు బ్రేక్‌‌ వేసింది. కాబట్టి నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నా. చిన్నప్పటి నుంచి ఇండియా తరఫున  వరల్డ్‌‌ కప్‌‌ సాధించాన్నదే నా గోల్‌‌.   ఎప్పుడూ  వరల్డ్‌‌కప్ ఎలా గెలవాలనే దాని గురించే ఆలోచిస్తుంటా. వరల్డ్‌‌ కప్‌‌లో నేను ఈ నంబర్‌‌లో బ్యాటింగ్‌‌ చేసి కప్‌‌ గెలుస్తానని ప్రతి రోజూ ఊహించుకుంటుంటా. ఇండియా జెర్సీలో గ్రౌండ్‌‌లోకి రావాలన్న ఊహ ఇప్పుడు నిజమైంది.  కాబట్టి  వరల్డ్‌‌ కప్‌‌ గెలిచే  క్షణం కూడా త్వరలో వస్తుందని భావిస్తున్నా.  అప్పుడు లభించే అనుభూతి గొప్పగా ఉంటుంది.  టీమ్‌‌లోకి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నా. ఇప్పుడు వరల్డ్​కప్ కోసం ఒక్కో అడుగూ వేయాలి’ అని తిలక్‌‌ చెప్పుకొచ్చాడు.