ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మను సడెన్ గా రిటైర్డ్ హర్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయం కావాల్సిందిగా తీవ్ర తీవ్ర వివాదాస్పదం అయింది. 17వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ అవుటైనా.. స్లోగానే ఆడుతుండటంతో ముంబై టీమ్ తిలక్ వర్మను సడెన్ గా రిటైర్డ్ హర్ట్ అవ్వాలని కోరింది. తిలక్ స్థానంలో వచ్చిన శాన్‌ట్నర్ ఆఖరి బంతికి రెండు పరుగులు మాత్రమే తీశాడు. చివరి ఓవర్‌లో స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ .. ఒక సిక్సర్‌తో కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
రిటైర్డ్ హర్ట్ పై మంగళవారం (ఏప్రిల్ 22) స్పందించాడు. ఐపీఎల్ లో బుధవారం (ఏప్రిల్ 23) సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరగనుంది. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న తిలక్ వర్మకు ఇది సొంత గడ్డ. ఈ మ్యాచ్ కు ముందు విలేఖరులతో మాట్లాడిన తిలక్ తన రిటైర్డ్ హర్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తిలక్ వర్మ మాట్లాడుతూ.. "LSG తో మ్యాచ్ లో నన్ను రిటైర్డ్ హార్ట్ గా తిరిగి రమ్మన్నప్పుడు చాలా బాధ పడ్డాను. నేను ఉంటే గెలిపించే వాడిని అనిపించింది. కానీ.. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం అది. ఏం అనలేకపోయా. ఉప్పల్ మంచి బ్యాటింగ్ పిచ్. రేపు పెద్ద స్కోర్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉంది. సొంత గడ్డ మీద ఆడుతున్నందుకు ఎమోషనల్ గా ఉంది". అని తిలక్ అన్నాడు
ఈ మ్యాచ్ లో తిలక్ తర్వాత సాంట్నర్‌ను బ్యాటింగ్‌కు వచ్చినా ప్రభావం చూపలేకపోయాడు. ఏడు బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తిలక్ ను బయటకు పంపించడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. తిలక్ స్థానంలో వచ్చిన శాన్‌ట్నర్ ఆఖరి బంతికి రెండు పరుగులు మాత్రమే తీశాడు. చివరి ఓవర్‌లో స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ .. ఒక సిక్సర్‌తో కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ముంబై తీసుకున్న షాకింగ్ డెసిషన్ కారణంగానే ఓడిపోయిందని, చెత్త నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుందని విమర్శలు వెల్లువెత్తాయి. తిలక్ వర్మ ఉండుంటే చివరి ఓవర్లో పుంజుకునేవాడేమో అని అంటున్నారు. భారీ షాట్లు ఆడటంలో తిలక్ వర్మకు పెట్టింది పేరు. లాస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ కు బౌండరీ బాదేవాడేమో? లేక ఆఖరి ఓవర్‌లో సిక్సర్లు కొట్టేవాడేమో? కదా అని టీమిండియా మాజీలు అంటున్నారు. ముంబై తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.