IND vs SA 2nd T20: తిలక్ వర్మ భారీ సిక్సర్.. స్టేడియం దాటిన బంతి

IND vs SA 2nd T20: తిలక్ వర్మ భారీ సిక్సర్.. స్టేడియం దాటిన బంతి

గెబార్హ వేదికగా సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ భారీ సిక్సర్ హైలెట్ గా నిలిచింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ మూడో బంతిని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కొయెట్జ్ లెంగ్త్ బాల్ విసిరాడు. ఈ బంతిని తిలక్ వర్మ మిడ్ వికెట్ దిశగా బలంగా కొట్టాడు. దీంతో బంతి ఏకంగా స్టేడియం దాటింది. మొదట స్టేడియం రూఫ్ కు తగిలిన బంతి ఆ తర్వాత స్టేడియం బయటకు వెళ్ళింది. భారత ఇన్నింగ్స్ లో ఈ సిక్సర్ హైలెట్ గా నిలిచింది.  

ఈ మ్యాచ్ లో ఒక సిక్సర్, ఒక ఫోర్ తో 20 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన తిలక్.. మిల్లర్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు ఔటయ్యాడు. తొలి మ్యాచ్ లోనూ విఫలమైన ఈ తెలుగు కుర్రాడు.. ఈ మ్యాచ్ లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి బ్యాటింగ్ చేస్తున్న భారత్ తడబడుతుంది. 15 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసి కష్టాల్లో పడింది. సంజు శాంసన్ (0) అభిషేక్ శర్మ (4), సూర్య కుమార్ యాదవ్ (4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.   

Also Read : భారత్ బ్యాటింగ్.. ఒక మార్పుతో సౌతాఫ్రికా జట్టు