ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో..తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో..తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ
  • రాహుల్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌కు చోటు
  • బ్యాకప్‌‌‌‌‌‌‌‌గా శాంసన్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌
  • ఈ నెల 30 నుంచి టోర్నీ

న్యూఢిల్లీ : టీ20ల్లో దుమ్మురేపుతున్న తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేశాడు. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ కోసం సోమవారం ప్రకటించిన 17 మంది టీమ్‌‌‌‌‌‌‌‌లో తిలక్‌‌‌‌‌‌‌‌కు తొలిసారి చోటు దక్కింది. వెన్ను గాయాల నుంచి కోలుకున్న కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. గతేడాది మార్చి నుంచి ఆటకు దూరంగా ఉంటున్న  శ్రేయస్‌‌‌‌‌‌‌‌ పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో ఉన్నాడని చీఫ్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్ అజిత్‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌ తెలిపాడు. అయితే రాహుల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో రాహుల్‌‌‌‌‌‌‌‌కు బ్యాకప్‌‌‌‌‌‌‌‌గా వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ కమ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ‘రాహుల్‌‌‌‌‌‌‌‌ ఇంజ్యురీ పాతది కాదు.

ఇప్పుడు కొత్తగా మొదలైంది. అందుకే ముందు జాగ్రత్తగా సంజూను కూడా శ్రీలంకకు తీసుకెళ్తున్నాం. ఒకవేళ రాహుల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌గా లేకపోతే ప్రత్యామ్నాయంగా శాంసన్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దించుతాం. శ్రేయస్‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని అగార్కర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 2న జరిగే తమ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాహుల్‌‌‌‌‌‌‌‌ ఆడటం డౌట్‌‌‌‌‌‌‌‌గానే కనిపిస్తున్నది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 17 వరకు ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ జరగనుంది. 

చహల్‌‌‌‌‌‌‌‌కు నో ప్లేస్‌‌‌‌‌‌‌‌

స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌గా అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన కమిటీ యజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌ను పక్కనబెట్టింది. ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర జడేజాను కొనసాగించింది. టీమ్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు రిస్ట్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్లకు చోటు కల్పించడం కష్టమనే ఉద్దేశంతో చహల్‌‌‌‌‌‌‌‌ను తప్పించామని అగార్కర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌కు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసే సత్తా ఉండటంతో సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ కమిటీ అతనివైపు మొగ్గిందని చెప్పాడు. వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌ పేసర్లుగా బుమ్రా, షమీ, సిరాజ్‌‌‌‌‌‌‌‌, పేస్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లుగా శార్దూల్‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణను తీసుకున్నారు. 

ఇందులో నుంచే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌కూ!

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌, టీ20ల్లో రాణించిన తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మకు ఆసియా టీమ్‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కడం ఓ రకంగా ప్రమోషనే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆడుతున్న తెలుగు కుర్రాడు వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ 17లో నుంచే 15 మందిని మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేయనున్నారు. ‘విండీస్‌‌‌‌‌‌‌‌లో తిలక్‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా ఆడాడు. అతనిలో నైపుణ్యంతో పాటు కసి కూడా ఉంది.

అందుకే ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ లెవెల్లో మరింత ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌ కోసం అతన్ని టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నాం’ అని అగార్కర్‌‌‌‌‌‌‌‌ వివరించాడు. రొటేషన్‌‌‌‌‌‌‌‌ పాలసీలో భాగంగానే 17 మందిని ఎంపిక చేశామని కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ వరకు 15 మందికి తగ్గిస్తారన్నాడు. దీని వల్లనే అశ్విన్​, సుందర్‌‌‌‌‌‌‌‌, చహల్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేకపోయామన్నాడు.