మన తిలక్‌‌‌‌‌‌‌‌ వచ్చేశాడు..టీమిండియాలోకి హైదరాబాదీ

మన తిలక్‌‌‌‌‌‌‌‌ వచ్చేశాడు..టీమిండియాలోకి హైదరాబాదీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: టీమిండియాలో  మన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి మరో క్రికెటర్​కు ప్లేస్‌‌‌‌‌‌‌‌ దక్కింది. కొన్నేండ్లుగా డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో దంచికొడుతూ.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో చెలరేగిపోతున్న యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ నంబూరి ఠాకూర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ టాలెంట్‌‌‌‌‌‌‌‌కు గుర్తింపు లభించింది.  వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో ఐదు  టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడే ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ 20 ఏండ్ల  బ్యాటింగ్​ ఆల్​రౌండర్​ తిలక్‌‌‌‌‌‌‌‌ ఎంపికయ్యాడు. ఆగస్టులో జరిగే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం ఆలిండియా సీనియర్‌‌‌‌‌‌‌‌ సెలెక్టన్‌‌‌‌‌‌‌‌ కమిటీ బుధవారం జట్టును ప్రకటించింది. హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యాను కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగించి తిలక్‌‌‌‌‌‌‌‌తో పాటు ముంబై యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ను తొలిసారి టీ20 టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకుంది. యశస్వి ఇప్పటికే విండీస్‌‌‌‌‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌కు కూడా ఎంపికై ప్రస్తుతం బార్బడోస్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. ఇదే టూర్‌‌‌‌‌‌‌‌లో టెస్టు, వన్డే టీమ్స్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన పేసర్‌‌‌‌‌‌‌‌ ముకేశ్‌‌‌‌‌‌‌‌కు టీ20ల నుంచి కూడా పిలుపు వచ్చింది. కొంత గ్యాప్‌‌‌‌‌‌‌‌ తర్వాత స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ తిరిగి టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ ఆడని రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కూ దూరంగా ఉంటున్నారు. ఆగస్టు 3, 6,8, 12, 13వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి. చివరి రెండు మ్యాచ్​లు ఫ్లోరిడాలో ఉంటాయి.

ఇండియా టీ20 టీమ్​: ఇషాన్ కిషన్ (కీపర్​), గిల్, యశస్వి, తిలక్ వర్మ, సూర్య కుమార్ (వైస్​​ కెప్టెన్​), శాంసన్ (కీపర్​), హార్దిక్ పాండ్యా (కెప్టెన్​), అక్షర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బిష్ణోయ్, అర్ష్​ దీప్, ఉమ్రాన్, అవేష్ ఖాన్, ముకేష్ కుమార్.

అది 2015. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌14 టీమ్‌‌‌‌‌‌‌‌లో చోటు కోసం ట్రై చేస్తున్న 12 ఏండ్ల  కుర్రాడికి తాను ఎంతగానో ఆరాధించే సురేశ్​ రైనాను కలిసే చాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. మిగతా కుర్రాళ్లంతా  రైనాతో ఫొటోలు దిగుతూ.. ఆటోగ్రాఫ్స్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటుంటే అతను మాత్రం రైనాను అలాగే చూస్తూ ఉండిపోయాడు. దీన్ని గమనించిన కోచ్‌‌‌‌‌‌‌‌  ‘ఏదో రోజు నువ్వు రైనాతో కలిసి ఆడే స్థాయికి రావాలి. నువ్వు ఐపీఎల్, టీమిండియాకు ఆడగలవని నేను నమ్ముతున్నా. నువ్వు నీ తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలి’ అని చెప్పిన మాటలు అతని మనసులో ఉండిపోయాయి. ఏడేండ్లు తిరిగేలోపే అతను ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేశాడు. మరో ఏడాదికే టీమిండియా నుంచి పిలుపు అందుకున్నాడు. ఆ బుడ్డోడు మరెవరో కాదు ఠాకూర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ. టన్నుల కొద్దీ టాలెంట్, టెంపర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, కొండంత ఆత్మవిశ్వాసం ఉన్న  క్రికెటర్‌‌‌‌‌‌‌‌.  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో గత రెండు సీజన్లలోతిలక్‌‌‌‌‌‌‌‌ ఆటను చూస్తే ఆ విషయం అర్థం అవుతోంది. 

అలా మొదలై..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తిలక్ స్వయం ప్రతిభతో ఒక్కో అడుగు వేస్తూ ముందుకొచ్చాడు. 11 ఏండ్ల వయసులో ​బ్యాట్​పట్టుకున్న తిలక్ సరదాగా దోస్తులతో టెన్నిస్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో గల్లీ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడుతూ కోచ్‌‌‌‌‌‌‌‌ సలామ్‌‌‌‌‌‌‌‌ బయాష్‌‌‌‌‌‌‌‌ కంట పడటం అతని లైఫ్​ను మార్చింది. మంచి ఫుట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌తో బాల్‌‌‌‌‌‌‌‌ను పుల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న తిలక్‌‌‌‌‌‌‌‌లో టాలెంట్‌‌‌‌‌‌‌‌ను గుర్తించిన బయాష్‌‌‌‌‌‌‌‌.. లింగంపల్లిలోని తన అకాడమీలో ఉచితంగా ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఎలక్ట్రీషియన్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న తిలక్‌‌‌‌‌‌‌‌ తండ్రి తొలుత ఒప్పుకోకపోయినా.. ఖర్చులన్నీ తానే చూసుకుంటానని చెప్పిన బయాష్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ను తీర్చిదిద్దాడు. అతని కోచింగ్​లో రాటుదేలిన తిలక్​ చూస్తుండగానే  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌14 టీమ్‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కించుకొని  వెనుదిరిగి చూసుకోలేదు. ఇంకో ఏడాదికే అండర్‌‌‌‌‌‌‌‌16లోకి వచ్చిన అతను తనకంటే ఎక్కువ ఏజ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ల్లో ఆడుతూ.. సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. విజయ్‌‌‌‌‌‌‌‌ మర్చంట్‌‌‌‌‌‌‌‌ (అండర్‌‌‌‌‌‌‌‌ 16), కూచ్‌‌‌‌‌‌‌‌ బెహార్‌‌‌‌‌‌‌‌ (అండర్‌‌‌‌‌‌‌‌19), సీకే నాయుడు (అండర్‌‌‌‌‌‌‌‌23) టోర్నీల్లో  చెలరేగిపోయాడు. దాంతో, 2018లో  ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌ 19 టీమ్‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యాడు. ఆ ఏడాది అండర్‌‌‌‌‌‌‌‌19 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఆడిన తిలక్‌‌‌‌‌‌‌‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ టీమ్‌‌‌‌‌‌‌‌లో పలువురు ప్లేయర్లకు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో చాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చినా తిలక్‌‌‌‌‌‌‌‌కు రాలేదు. దాంతో, మరింత కష్టపడ్డ వర్మ 2021 విజయ్ హజారే ట్రోఫీలో రెండు సెంచరీలు సహా 97 సగటుతో సత్తా చాటడంతో 2022లో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యాడు. రోహిత్‌‌‌‌‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ వంటి స్టార్లతో ఆట.. సచిన్‌‌‌‌‌‌‌‌, జయవర్దనే  వంటి లెజెండ్ల గైడెన్స్‌‌‌‌‌‌‌‌తో అతను మరింత రాటుదేలాడు.

ఆల్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌

టాప్‌‌‌‌‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో ఎక్కడైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయగలగడం తిలక్​ అతి పెద్ద బలం. పేస్‌‌‌‌‌‌‌‌, స్పిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో భారీ షాట్లతో అలవోకగా బాల్‌‌‌‌‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌‌‌‌‌లోకి పంపే సత్తా అతని సొంతం. ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడటం.. జట్టు బాధ్యతను భుజాలపై వేసుకోవడం అతనికి చిన్నప్పటి నుంచే అలవాటు. తను మంచి ఆఫ్​ స్పిన్​​ బౌలింగ్​ కూడా వేయగలడు. తిలక్‌‌‌‌‌‌‌‌ టీ20 హిట్టర్‌‌‌‌‌‌‌‌ మాత్రమే కాదు అన్ని ఫార్మాట్లలోనూ అడే దమ్మున్న క్రికెటర్​. గంటల కొద్దీ క్రీజులో నిలుచొని ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ నిర్మించగలడు. 2017లో గుజరాత్‌‌‌‌‌‌‌‌తో జరిగిన విజయ్‌‌‌‌‌‌‌‌ మర్చంట్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌16 ట్రోఫీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 136 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు 518 బాల్స్‌‌‌‌‌‌‌‌ ఎదుర్కోవడం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. టీ20 టీమ్ నుంచి పిలుపు తిలక్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఆరంభం మాత్రమే. తను అన్ని ఫార్మాట్లోనూ టీమిండియాలో మెంబర్‌‌‌‌‌‌‌‌ అవ్వాలని ఆశిద్దాం.