
కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని పీహెచ్సీలో పనుల్లో నాణ్యతా లోపం సిబ్బందికి శాపంగా మారింది. మంగళవారం హాస్పిటల్ లో పని చేస్తున్న కాంటిజెంట్ వర్కర్ మిరియాల రవీందర్ గదులను శుభ్రం చేస్తుండగా, గోడపై నుంచి టైల్స్ ఊడి తలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. రవీందర్‌ను మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. నాసిరకంగా హాస్పిటల్ రిపేర్లు చేయడంతో వర్షపు నీళ్లు గదుల్లోకి వస్తోందని, మందులు పాడవుతున్నాయని పేర్కొంటున్నారు