టిల్లు స్క్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ గ్లింప్స్‌‌‌‌ విడుదల

‘డీజే టిల్లు’తో ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో సిద్దు జొన్నలగడ్డ.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘టిల్లు స్క్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఒకటి. మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. బుధవారం సిద్ధు బర్త్‌‌‌‌ డే సందర్భంగా విషెస్ చెబుతూ వీడియో గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. కారులో వెళ్తున్న సిద్ధును, గత పుట్టినరోజు గురించి అనుపమ పరమేశ్వరన్‌‌‌‌ అడగడం, రాధికతో జరిగిన ఇన్సిడెంట్స్‌‌‌‌ను టిల్లు గుర్తు చేసుకోవడాన్ని గ్లింప్స్‌‌‌‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా చూపించారు.

ఫిబ్రవరి 14న ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయనున్నారు. మార్చి 29న సినిమా విడుదల కానుంది. మరోవైపు సిద్ధు హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌‌‌‌‌‌‌‌ తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘జాక్‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌ను ఫైనల్  చేస్తూ, పోస్టర్ విడుదల చేశారు. ఇందులో గన్స్‌‌‌‌ పట్టుకుని యాక్షన్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించాడు సిద్ధు. ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్.  బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మరోవైపు నీరజ కోన దర్శకత్వంలో పీపుల్స్‌‌‌‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌‌‌‌‌‌‌‌ను బట్టి మహారాష్ట్ర నేపథ్యంలో సాగే కథ ఇదని అర్థమవుతోంది. రాశీ ఖన్నా, నిధి శెట్టి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు.