
ఐపీఎల్ 2025లో సోమవారం (ఏప్రిల్ 7) బ్లాక్ బస్టర్ సమరానికి రంగం సిద్ధమైంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడబోతుంది. ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో హార్దిక్ సేన ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఒక విజయం, మూడు పరాజయాలతో ఢీలా పడ్డ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. మరోవైపు రెండు విజయాలతో జోరుమీదున్న బెంగళూరు.. గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడింది. దీంతో ముంబైపై కచ్చితంగా నెగ్గాలని భావిస్తోంది.
మోకాలి గాయంతో లక్నోతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బరిలోకి దిగే చాన్స్ ఉంది. బ్యాటింగ్ బలహీనంగా మారిన ముంబై బౌలింగ్‌లో మాత్రం ఓ గుడ్‌న్యూస్. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగడం ఖాయమైంది. బుమ్రా నేడు మ్యాచ్ ఆడుతున్నట్టు ముంబై హెడ్ కోచ్ మహేళ జయవర్ధనే ఆదివారం (ఏప్రిల్ 6) కన్ఫర్మ్ చేశాడు. బుమ్రా రావడంతో ముంబై ఒక్కసారిగా బలంగా మారింది. వెన్ను గాయం నుంచి కోలుకున్న బుమ్రా దాదాపు 3 నెలల తర్వాత మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా వచ్చినా తమకేం భయం లేదంటున్నాడు ఆర్సీబీ ఫినిషర్ టిమ్ డేవిడ్.
మ్యాచ్ కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో డేవిడ్ మాట్లాడుతూ.. "ఈ టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లాలంటే అత్యుత్తమ జట్లను, అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించాలి. రేపు రాత్రి బుమ్రా మొదటి ఓవర్ వేస్తాడని ఆశిస్తున్నాను. అతను వేసిన తొలి ఓవర్ తొలి బంతి ఫోర్ లేదా సిక్సర్ అవుతుంది. మా జట్టు తరపున ఎవరు ఓపెనింగ్ చేసినా నా స్టేట్ మెంట్ నిజమవుతుంది. అతను టోర్నమెంట్‌లో తిరిగి రావడం సంతోషం. మైదానంలో బుమ్రా ఉన్నప్పుడు క్రికెట్ ఎల్లప్పుడూ ఛాలెంజింగ్ గా ఉంటుంది". అని డేవిడ్ అన్నాడు.
Statement By RCB Player Tim David against Jasprit Bumrah.🔥🔥
— RAVI PRAKASH (@TheRavi_Prakash) April 7, 2025
RCB is different gravy this time.#MIvsRCB pic.twitter.com/Tf9aOsA2d2