Pakistan Cricket Board: ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్‌కు పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ బాధ్యతలు

టీ20 వరల్డ్ కప్ తర్వాత పాకిస్థాన్ తమ తొలి అంతర్జాతీయ సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ సిద్ధమవుతుంది. ఆగస్ట్ 21న రావల్పిండిలో మొదటి టెస్ట్.. ఆగస్టు 30న  కరాచీలో రెండో టెస్ట్ జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ టిమ్ నీల్సన్‌ను టెస్టుల్లో హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమించింది. ప్రస్తుతం పాకిస్థాన్ టెస్ట్ హెడ్ కోచ్ గా ఉంటున్న జాసన్ గిల్లెస్పీతో కలిసి నీల్సన్ కోచింగ్ బాధ్యతలు చేపడతారు. 

గిలెస్పీ, నెల్సన్ ఒకప్పుడు దక్షిణ ఆస్ట్రేలియాలో కలిసి పనిచేశారు. వీరిద్దరి అనుభవం పాక్ టెస్ట్ క్రికెట్ కు పనికొస్తుందని ఆ దేశ క్రికెట్  బోర్డు భావిస్తోందట. నెల్సన్ ఫిబ్రవరి 2007 నుండి సెప్టెంబరు 2011 వరకు ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌గా పని చేశాడు ఉన్నాడు. నీల్సన్ కోచ్ గా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికాలో జరిగిన 2010 ఛాంపియన్స్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుచుకుంది. 56 ఏళ్ల నీల్సన్.. దక్షిణాఫ్రికా తరపున 101 ఫస్ట్-క్లాస్.. 49 లిస్ట్-ఏ గేమ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 3,800కి పైగా పరుగులు.. లిస్ట్-ఎ ఫార్మాట్‌లో 639 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. 

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు

షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), మరియు షాహీన్ షా అఫ్రిది .