IND vs AUS: కోహ్లీ, రోహిత్ ఫామ్ కాదు.. అతడే భారత్‌కు పెద్ద సమస్య: మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్

IND vs AUS: కోహ్లీ, రోహిత్ ఫామ్ కాదు.. అతడే భారత్‌కు పెద్ద సమస్య: మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్

అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. వెరసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ లో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గెలవడానికి మైండ్ గేమ్ మొదలుపెట్టే ఆస్ట్రేలియా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ జట్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

 గంభీర్ కోచింగ్ భారత జట్టుకు అతి పెద్ద మైనస్ అని ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ తెలిపాడు. భారత్ రెండు సార్లు ఆస్ట్రేలియాలో ట్రోఫీ గెలిచింది. ఆ సమయంలో టీమిండియాకు రవిశాస్త్రి సలహాలు బాగా పని చేశాయి. ఒక కోచ్ గా జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఈ సిరీస్ లో కోహ్లీ, రోహిత్ ఫామ్ కాదు. గంభీర్ కోచ్ గా ఉండడమే భారత్ కు ప్రధాన సమస్య. ఒత్తిడిలో గంభీర్ జట్టును హ్యాండిల్ చేయగలడని నేను అనుకోవట్లేదు". అని ఈ మాజీ ఆసీస్ కెప్టెన్ అన్నాడు. 

ALSO READ | IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొత్త అవతారం.. పుజారాకు ఇలాంటి పరిస్థితి ఏంటి

1991–92 తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ఎక్కువగా నాలుగు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గానే  నిర్వహించేవారు.సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.