న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్,టిమ్ సౌతీ టెస్ట్ కెరీర్ లో గొప్ప మైలురాయిని అందుకున్నారు. తమ టెస్ట్ కెరీర్ లో నేడు(మార్చి 8) 100 టెస్టులు పూర్తి చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వీరు ఈ ఘనతను అందుకున్నారు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని తమ పిల్లలతో జరుపుకోవడం విశేషం. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో తమ 100వ టెస్టుకు ముందు తమ పిల్లలతో కలిసి గ్రౌండ్ లోకి వెళ్లారు. ఈ వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్ (X)లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సౌతీ 2008లో తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. 15 ఏళ్లకు పైగా తన టెస్ట్ కెరీర్ లో ట్రెంట్ బౌల్ట్‌తో కలిసి కివీస్ టాప్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. తన టెస్ట్ కెరీర్ లో ఈ పేసర్ ఇప్పటివరకు 378 వికెట్లు పడగొట్టాడు. విలియంసన్ 2010లో తన టెస్ట్ అరంగేట్రాన్ని చేసాడు. బ్యాటర్ గా, కెప్టెన్ గా కివీస్ తరపున ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 50కి పైగా సగటుతో 8692 పరుగులు చేశాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య నిన్న (మార్చి 7) జరిగిన ధర్మశాల టెస్టులో భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో 100 టెస్టులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆస్ట్రేలియాపై జరుగుతున్న టెస్ట్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవలం 162 పరుగులకే ఆలౌటైంది. విలియంసన్ 17 పరుగులతో నిరాశ పరిచాడు. 38 పరుగులు చేసిన టామ్ లాతమ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజల్ వుడ్ 5 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. స్టార్క్ కు మూడు వికెట్లు దక్కాయి.
A special moment for Special players
— Don Cricket 🏏 (@doncricket_) March 8, 2024
Kane Williamson and Tim Southee playing their 100th Test Match.#AUSvsNZpic.twitter.com/YSDs7UFl79