ఐసీసీ టోర్నీ అంటే చాలు భారత్ పై న్యూజిలాండ్ ఆధిపత్యం చూపిస్తుంది. బలాబలాలు ఎలాగున్నా ఆ సమయానికి కివీస్ దే పై చేయి. అయితే ఈ సారి కేన్ విలియమ్సన్ లేకపోవడంతో భారత్ పై విజయంపై ధీమాగా ఉన్నారు టీమిండియా ఫ్యాన్స్. కేన్ మామ లేకపోనా కివీస్ జట్టులో స్టార్ పేసర్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడెవరో కాదు సీనియర్ బౌలర్ టీం సౌథీ.
వరల్డ్ కప్ లో భాగంగా రేపు (అక్టోబర్ 22) భారత్-న్యూజిల్యాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల ఈ మ్యాచుకు వేదిక కానుంది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచులో గెలిచిన ఇరు జట్లు.. రేపటి మ్యాచులోను నెగ్గి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్.. ఈ మ్యాచుకు స్టార్ పేసర్ సౌథీని బరిలోకి దింపనున్నారు. గాయం కారణంగా ఈ సీనియర్ పేసర్ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ భారత్ లాంటి పటిష్టమైన జట్టుపై సౌథీని తీసుకురావాలని కివీస్ భావిస్తుంది.
ఈ మ్యాచు సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ భారత్ పై రేపు ధర్మశాలలో జరిగే మ్యాచుకు సౌథీ అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసాడు. బౌల్ట్, సౌథీ కలిస్తే ఎంత స్టార్ బ్యాటర్ కైనా ఇబ్బందులు తప్పవు. మరోవైపు భారత్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య సేవలను కోల్పోనుంది. వరల్డ్ కప్ కు ముందు ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో సౌథీ గాయపడ్డాడు. మరి సౌథీ రాకతో మరింత బలంగా తయారైన కివీస్ భారత్ ని మరోసారి ఓడిస్తుందేమో చూడాలి.
Tim Southee likely to play against India tomorrow. He's available for selection.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 21, 2023
Kane Williamson ruled out of the match. pic.twitter.com/5unKRKUr6C