MS Dhoni: ఆ ఛాన్స్ వస్తే ఒక రోజు ధోనీలా మారాలని ఉంది: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్

భారత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) పేరొక ఒక సువర్ణాధ్యాయం. ఎక్కడో రాంచీలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ధోని.. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత క్రికెట్ తలరాతనే మార్చాడు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ధోని సాధించిన రికార్డులను భవిష్యత్తులో ఇంకొకరు చెరిపోయొచ్చేమో కాని.. మైదానంలో అతనిలా వ్యూహాలు రచించే 'క్రికెట్ జీనియస్'ను తిరిగి పొందటమన్నది అసాధ్యం. అలాంటి మహేంద్రుడికి బయట అభిమానులే కాదు క్రికెటర్లు కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. 

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌతీ.. ధోనీని అభిమానించే లిస్టులో చేరిపోయాడు. మహేంద్రుడిపై తన అభిమానాన్ని చాటుకుంటూ ఏకంగా ధోనీలా మారిపోవాలని ఉందని చెప్పాడు. సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌కు హాజరైన సౌథీకి..  అక్కడ రిపోర్ట్రర్ మీకు అవకాశం వస్తే ఏ క్రికెటర్ లా మారాలని ఉంది అని అడిగారు. దీనికి ఈ కివీస్ పేసర్ క్షణమైన ఆలోచించకుండా మహేంద్ర సింగ్ ధోనీ అని సమాధాన మిచ్చాడు. తనకు ధోనీలా ఒక రోజు మారాలని ఉందని.. అతని జీవితమా ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను అని సౌథీ తెలిపాడు.

Also Read :- జూ. హిట్ మ్యాన్ కమింగ్

ఈ కివీ పేసర్ టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అద్భుతమైన ఆల్ ఫార్మాట్ బౌలర్ అని కొనియాడాడు. ప్రస్తుతానికి బుమ్రాను మించిన వారు ఎవరూ కనిపించడం లేదని.. గాయం తర్వాత అద్భుతమైన పునరాగమనం చేశాడని ప్రశంసించాడు. న్యూజిలాండ్ ఆల్ టైమ్ అత్యంత విజయవంతమైన బౌలర్లలో సౌతీ ఒకడు. 2008లో తన అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ 35 ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు 100 టెస్టులు, 161 వన్డేలు, 126 టీ20 మ్యాచ్ లాడాడు. అన్ని ఫార్మాట్ లలో కలిపి 765 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.