న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ ముగిసింది. ఇంగ్లాండ్ తో మంగళవారం (డిసెంబర్ 17) చివరిదైన మూడో టెస్ట్ లో న్యూజిలాండ్ 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంతో సౌథీ తన కెరీర్ ను ఘనంగా ముగించాడు. తన చివరి ఇన్నింగ్స్ లో సౌథీ రెండు వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్ లో తన చివరి ఇన్నింగ్స్ లో 2 పరుగులు చేశాడు. ఈ టెస్టుకు ముందు ఫ్యామిలీతో కలిసి ఎమోషనల్ అయిన సౌథీకి ఇంగ్లాండ్ క్రికెటర్లు గార్డ్ ఆఫ్ హానర్ తో సత్కరించారు.
సౌథీ ఇప్పటివరకు కివీస్ తరపున 107 టెస్టుల్లో ఆడాడు. 202 ఇన్నింగ్స్ లో 391 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఘనతను 15 సార్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా సౌథీ కొనసాగుతున్నాడు. 431 వికెట్లతో రిచర్డ్ హ్యడ్లి తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. తొలి రెండు సెషన్ లు ముగిసే సరికీ 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లేతమ్ 63 పరుగులు చేసి రాణించాడు.
ALSO READ : విలియమ్సన్ భారీ సెంచరీ
సౌథీ గత నెలలో (నవంబర్ 15) తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 2008 లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన సౌథీ 16 ఏళ్ళ పాటు కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం కఠినమైన నిర్ణయమని.. రిటైర్మెంట్ కు ఇదే సరైన నిర్ణయమని శుక్రవారం (నవంబర్ 15) సౌథీ తెలిపాడు.
- 391 Test wickets.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024
- 98 Test sixes.
- 7 fifties.
- 15 five wicket hauls.
HAPPY RETIREMENT, TIM SOUTHEE. ❤️ pic.twitter.com/AYZAcbKXWq