ENG vs NZ: 16 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై: టెస్ట్ క్రికెట్‌కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్

ENG vs NZ: 16 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై: టెస్ట్ క్రికెట్‌కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్

న్యూజిలాండ్‌ స్టార్ ఫాస్ట్ బౌలర్ టిమ్‌ సౌథీ 16 ఏళ్ల తన టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం (నవంబర్ 15) తన రిటైర్మెంట్ విషయాన్ని ఈ కివీస్ పేసర్ అధికారికంగా ప్రకటించాడు. స్వదేశంలో న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ ఆడబోయే మూడు టెస్టుల తర్వాత సౌథీ తన టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడు. 2008 లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన సౌథీ 16 ఏళ్ళ పాటు కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు. 

అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం కఠినమైన నిర్ణయమని.. రిటైర్మెంట్ కు ఇదే సరైన నిర్ణయమని శుక్రవారం (నవంబర్ 15) సౌథీ తెలిపాడు. న్యూజిలాండ్ వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోకపోతే.. ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్ తన టెస్ట్ కెరీర్ లో చివరిదని అని సౌతీ చెప్పుకొచ్చాడు. 16 సంవత్సరాలు న్యూజిలాండ్ కు ఆడడం ఆడటం గొప్ప గౌరవమని తన క్రికెట్ కెరీర్ లో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. 

Also Read :- రింకూ స్థానంలో వికెట్ కీపర్‌కు ఛాన్స్

సౌథీ ఇప్పటివరకు కివీస్ తరపున 104 టెస్టుల్లో ఆడాడు. 197 ఇన్నింగ్స్ లో 385 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఘనతను 15 సార్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా సౌథీ కొనసాగుతున్నాడు. 431 వికెట్లతో  రిచర్డ్ హ్యడ్లి తొలి స్థానంలో ఉన్నాడు.