టైం ఫిక్స్..సునితావిలియమ్స్ భూమ్మీద ఎప్పుడు కాలుపెడుతుందంటే..

టైం ఫిక్స్..సునితావిలియమ్స్ భూమ్మీద ఎప్పుడు కాలుపెడుతుందంటే..

భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిమీద కాలుపెట్టేందుకు డేట్ అండ్ టైం ఫిక్స్ అయింది..బుధవారం (మార్చి 19) తెల్లవారు జామును 3.17 గంటలకు ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో దిగనున్నారు. ఫ్లోరిడా సమీపంలో సముద్ర జలాల్లో స్పెస్ ఎక్స్ క్యాప్సూల్స్ ల్యాండ్ కానుంది. 

9నెలలుగా వ్యోమగాములు సునితావిలిమయ్స్, విల్ మోర్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ISS) లోనే ఉన్నారు. ఎనిమిది రోజుల ప్రయోగం కోసం ISS కు వెళ్లారు సునితావిలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు. సాంకేతిక కారణాలతో తిరిగి భూమ్మీదకు  రాలేకపోయారు. ఎట్టకేలకు 9నెలల తర్వాత భూమిని చేరుతున్నారు. 

నాసా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ అనేక రికార్డులు సృష్టించారు. ఇప్పటికే మూడు స్పేస్ క్రాఫ్ట్ లలో ప్రయాణించిన ఆమె..స్పేస్ ఎక్స్ క్రూజ్ 9లో బుధవారం భూమిని తాకిన తర్వాత మరో రికార్డు సృష్టించనున్నారు. నాలుగు అంతరిక్ష నౌకలలోప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునితా విలియమ్స్ రికార్డుకెక్కనున్నారు.  

అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి ఇప్పటికే బయలుదేరారు. 2025, మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల 25 నిమిషాల సమయంలో.. అంతరిక్ష కేంద్రం (ISS) ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్ అన్ లాక్ అయ్యింది. 18 గంటల ప్రయాణం తర్వాత అమెరికాలోని ఫ్లోరిడా సమీపంలో డ్రాగన్ ల్యాండ్ అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ALSO READ | మీరు క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నాం: సునీతా విలియమ్స్‎కు ప్రధాని మోడీ ఎమోషనల్ లెటర్

ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 9 డ్రాగన్ ను నలుగురు వ్యోమగాములు స్పేస్ సెంటర్ కు వెళ్లారు. వాళ్లు స్పేస్ సెంటర్ లోకి ఎంటర్ అయిన 24 గంటల తర్వాత.. అదే క్రూ 9లో.. తొమ్మిది నెలల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి భూమిపైకి బయలుదేరారు.